News November 20, 2024

సంపన్నుల మహారాష్ట్రను ఓడించిన భూమిపుత్రుల ఝార్ఖండ్

image

ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటుహక్కు. దానిని ఉపయోగించుకోవడంలో ఫార్వర్డ్ స్టేట్ మహారాష్ట్ర వెనకబడగా బ్యాక్‌వర్డ్ స్టేట్ ఝార్ఖండ్ ముందుచూపు కనబరిచింది. అధిక పట్టణ జనాభా, అప్పర్ మిడిల్ క్లాస్, సంపన్నులుండే మరాఠా రాష్ట్రంలో ఓటేసేందుకు ఉత్సాహం చూపించలేదు. గిరిజనులు, గ్రామీణులు అధికంగా ఉండే ఝార్ఖండ్ భూమిపుత్రులు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. 3PMకు JHAలో 61%, MHలో 45% ఓటింగ్ నమోదవ్వడమే ఇందుకు ఉదాహరణ.

Similar News

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
* మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
* వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళనకు దిగారు. మెటీరియల్ సరఫరా చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను తమపై మోపడం సరికాదన్నారు.

News November 17, 2025

ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

image

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111 రన్స్‌కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.

News November 17, 2025

ఐఐటీ గువాహటీలో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు

image

ఐఐటీ గువాహటీ 3 రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MSc, B.Sc, డీ ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 40కాగా, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు 35ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iitg.ac.in/