News March 16, 2024
భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలి: కాసోజు శంకరమ్మ
ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Similar News
News November 21, 2024
NLG: ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలను డిసెంబర్ 7వ తారీకు నుంచి నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఐదవ సెమిస్టర్ పరీక్షలను మధ్యాహ్నం నిర్వహిస్తామని వెల్లడించారు.
News November 21, 2024
గత ప్రభుత్వం జాతీయ రహదారుల గురించి పట్టించుకోలేదు: కోమటిరెడ్డి
గత ప్రభుత్వం పదేండ్లలో జాతీయ రహదారుల నిర్మాణాల గురించి పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కుంటుపడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారన్నారు. బంజారహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు.
News November 20, 2024
నాగార్జునసాగర్ పర్యాటక రంగానికి మహర్దశ!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగార్జునసాగర్ పర్యాటక రంగానికి మహర్దశ పట్టనుంది. రూ.100 కోట్లతో సాగర్తో పాటు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అనువైన చోట స్టార్ హోటల్స్, కాటేజీలు, జలాశయంలో వాటర్ గేమ్స్, స్పీడ్ బోట్లు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.