News November 11, 2024
బైడెన్.. కమలను 30 రోజులైనా ప్రెసిడెంట్‌గా నియమించండి: జమల్ సిమ్మన్స్

జో బైడెన్ వెంటనే రిజైన్ చేసి కమలా హారిస్‌ను ప్రెసిడెంట్‌గా నియమించాలని ఆమె మాజీ కమ్యూనికేషన్ డైరెక్టర్ జమల్ సిమ్మన్స్ అన్నారు. మార్పుకు నాంది పలికి USకు తొలి మహిళా అధ్యక్షురాలిని చేయాలని కోరారు. ‘జో బైడెన్ అద్భుతమైన ప్రెసిడెంట్. చాలా హామీలు నెరవేర్చారు. ఆయన మరో హామీ నెరవేర్చాలి. కమలను కనీసం 30 రోజులైనా ప్రెసిడెంట్‌గా నియమించాలి. అప్పుడే మరో మహిళ అధ్యక్ష పదవికి పోటీచేయడం సులభమవుతుంది’ అని అన్నారు.
Similar News
News December 10, 2025
టీడబ్ల్యుజేఎఫ్ ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ ఏకగ్రీవం

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్‌గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్‌ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.
News December 10, 2025
సుందర్ పిచాయ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


