News September 10, 2024
సైన్యం వద్దంటున్నా బైడెన్ వినలేదు: నివేదిక

అఫ్గానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ వద్దని అమెరికా మిలిటరీ, అఫ్గాన్ ప్రభుత్వం, నాటో సూచిస్తున్నా దేశాధ్యక్షుడు బైడెన్ లెక్కచేయలేదని US విదేశీ వ్యవహారాల కమిటీ నివేదిక వెల్లడించింది. ‘నిపుణులు, సలహాదారుల సూచనలన్నింటినీ బైడెన్ పెడచెవిన పెట్టారు. దేశ ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రతిష్ఠే ముఖ్యమనుకున్నారు. తన నిర్ణయానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అనేక అబద్ధాల్ని చెప్పుకొచ్చారు’ అని నివేదిక తెలిపింది.
Similar News
News October 27, 2025
విషాదాలు మిగిలిస్తున్న తుఫాన్లు

AP: తుఫాన్లు కోస్తాంధ్రాను అతలాకుతలం చేస్తున్నాయి. 1971-2023 మధ్య 60 తీవ్రమైన సైక్లోన్లు తీరం దాటాయి. 1971లో బారువ, 1977లో దివిసీమ, 1996లో బలుసుతిప్పతో పాటు తర్వాత సంభవించిన ఖైముక్, లైలా, జల్, నీలం, హుద్‌హుద్, తితిలీ తుఫాన్లు తీవ్ర ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. MAR నుంచి JUNE.. SEP నుంచి DEC వరకు 2 సీజన్లలో సైక్లోన్లు సంభవిస్తుంటాయి. కానీ వాతావరణ మార్పులతో OCTలోనే దూసుకొస్తున్నాయి.
News October 27, 2025
శనగపిండితో చర్మానికి మెరుపు

చర్మసంరక్షణకు మన పూర్వీకుల కాలం నుంచీ శనగపిండిని వాడుతున్నారు. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొడిచర్మం ఉన్నవారు హైడ్రేషన్ కోసం శనగపిండిని వాడాలంటున్నారు. దీనికోసం 4 స్పూన్ల శనగపిండి, రోజ్‌వాటర్/ నిమ్మరసం, కాస్త తేనె కలపాలి. దీన్ని ఫేస్‌కి, మెడకు పట్టించుకొని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
News October 27, 2025
త్వరలో హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు

నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద జీరో ఎమిషన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని క్రమంగా పెంచుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ 10,900 బస్సుల కోసం NOV 6న బిడ్లను ఓపెన్ చేయనుంది. వీటిల్లో హైదరాబాద్‌కు 2,000, సూరత్ & అహ్మదాబాద్‌కు 1,600, ఢిల్లీకి 2,800, బెంగళూరుకు 4,500 కేటాయించనుంది.


