News July 21, 2024

ఒత్తిడి పెరుగుతున్నా తగ్గనంటున్న బైడెన్!

image

US అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేస్తున్న బైడెన్ సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా లెక్కచేయడం లేదు. కరోనా సోకి ఐసొలేషన్‌లో ఉన్న బైడెన్ ఎంత మంది కీలక వ్యక్తులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారట. దీంతో డెమోక్రాట్లు సందిగ్ధంలో పడినట్లు సమాచారం. ఇప్పటికే అనేకసార్లు తన తడబాటుతో అసంతృప్తి మూటగట్టుకున్న బైడెన్ మున్ముందు ఎలా రాణిస్తారనేది చర్చనీయాంశమైంది.

Similar News

News November 25, 2025

మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

image

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్‌ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.

News November 25, 2025

నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

image

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.

News November 25, 2025

GAIL (INDIA) లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>GAIL<<>>(INDIA)లిమిటెడ్‌ 29 బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE, B.Tech, ME, M.Tech, MCA, MBA, CA, CMA, B.Com, BA, BSc, MBBS, DGO, DCH ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, PWBDలకు ఫీజు లేదు. https://www.gailonline.com