News September 22, 2024

బైడెన్ – మోదీ ద్వైపాక్షిక చర్చలు

image

డెలావేర్‌లో క్వాడ్ సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సంద‌ర్భంగా MQ-9B ప్రిడేటర్ డ్రోన్ ఒప్పందం, కోల్‌కతాలో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుతో సహా పలు అంశాలపై నేతలు చర్చించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంపై, ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సహా ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్న‌ట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Similar News

News September 22, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

AP: తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.

News September 22, 2024

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: హీరో

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరం. ఇది లోపం కాదు. విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానపరిచారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.

News September 22, 2024

చంద్రబాబు పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం: VSR

image

AP: తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేయడంలో చంద్రబాబు ఆద్యుడు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘100 రోజుల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రూ.40వేల కోట్ల అప్పులు చేశారు. నేరాలు దారుణంగా పెరిగిపోయాయి. మిగతా 1725 రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు, రాష్ట్ర విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం’ అని ట్వీట్ చేశారు.