News July 19, 2024

అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్..?

image

వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఆ దేశ మీడియా కథనాల్ని ప్రచురించింది. ‘తన గెలుపునకు అవకాశాలు లేకపోవడంతో బైడెన్ వాస్తవికంగా ఆలోచిస్తున్నారు. తాను గెలవనన్న విషయాన్ని సన్నిహితుల వద్ద అంగీకరించారు. కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం తాను తప్పుకొంటున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది’ అని మీడియా సంస్థలు తెలిపాయి.

Similar News

News November 18, 2025

ఎనామలీ స్కాన్ ఎందుకంటే?

image

ప్రెగ్నెన్సీలో 20వారాల తర్వాత ఎనామలీ స్కాన్ చేయించాలని వైద్యులు సూచిస్తారు. మీ గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాల ఆకృతిని ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(CHD) వంటివి ఇందులో తెలుస్తాయి. అంతర్గత అవయవాల ఎదుగుదలను కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఈ టెస్ట్ తప్పనిసరి.

గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

image

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.