News December 2, 2024

2 కేసుల్లో కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష

image

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రకటించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో డెలావెర్, కాలిఫోర్నియాలో అతనిపై కేసులున్నాయి. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, కానీ రాజకీయాల ప్రభావంతో న్యాయం తప్పుదోవ పడుతోందన్నారు. ఓ తండ్రిగా, అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 4, 2025

పుతిన్‌ ఇష్టపడే ఆహారం ఇదే!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ భారత్‌కు రానున్నారు. ఆయన PM మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేస్తారని సమాచారం. పుతిన్ సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో చీజ్, తేనె కలిపి చేసే ట్వోరోగ్ తింటారు. గుడ్లు, పండ్ల జ్యూస్ తీసుకుంటారు. చేపలు, గొర్రె మాంసం ఇష్టంగా తింటారు. షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటారు. అరుదుగా ఐస్‌క్రీమ్ తీసుకుంటారు. అధికారిక డిన్నర్లలో చేపల సూప్, నాన్ వెజ్‌కు ప్రాధాన్యమిస్తారు.

News December 4, 2025

రూ.50లక్షలతో మూవీ తీస్తే రూ.100కోట్లు వచ్చాయ్!

image

గుజరాతీ సినిమా చరిత్రలో ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్రం రికార్డు సృష్టించింది. కేవలం ₹50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 19,900% ప్రాఫిట్స్‌తో రూ.100 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్ లేకపోయినా కథలో బలం, మౌత్ టాక్ ద్వారా సినిమా ఇంతటి విజయం సాధించిందని తెలిపాయి. కాగా రిలీజైన ఏడో వారం కూడా థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.

News December 4, 2025

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు సూచనలు

image

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీచేయాలి. తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. ఏటా తొలకరిలో ఎండుపుల్లలను కత్తిరించి దూరంగా పారేయాలి. శిలీంధ్రాలకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కల కట్టడికి మల్చింగ్ విధానం అనుసరించాలి. కలుపు మందులు, రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.