News September 22, 2024

చైనాపై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. మైక్‌లో రికార్డ్ అవ్వడంతో చర్చ

image

క్వాడ్ దేశాధినేత‌ల‌తో చైనాను ఉద్దేశించి అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు మైక్‌లో రికార్డ్ అవ్వ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ‘చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఆర్థిక-సాంకేతిక సమస్యలతో సహా అనేక రంగాలలో మనందరినీ పరీక్షిస్తోంది’ అని బైడెన్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో చైనా తీరుపై అమెరికా గుర్రుగా ఉంద‌న్న విష‌యం మరోసారి స్ప‌ష్ట‌మైంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

Similar News

News January 22, 2026

ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి

image

ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూ సౌత్ వేల్స్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిడ్నీకి సుమారు 611KM దూరంలో ఉన్న లేక్ కార్గెల్లిగోలో కాల్పులు జరిగాయి. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోయినేడాది DEC 14న బాండీ బీచ్‌లో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో 10 కంటే ఎక్కువ మంది బలయ్యారు.

News January 22, 2026

అధిక స్క్రీన్ టైమ్‌తో పిల్లల హార్ట్‌కు రిస్క్

image

పిల్లలు ఫోన్లు, TVలకు గంటల తరబడి అతుక్కుపోవడం వల్ల వారి గుండె ఆరోగ్యం దెబ్బతింటోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో పబ్లిష్ అయిన తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రతి అదనపు గంట స్క్రీన్ టైమ్ BP, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్‌ను పెంచి గుండెకు ముప్పును తలపెడుతోంది. నిద్ర తక్కువైతే ఈ ప్రమాదం మరీ ఎక్కువ. మొబైల్ వాడకాన్ని తగ్గించి పిల్లలకు తగినంత నిద్ర, శారీరక శ్రమ ఉండేలా చూడాలని స్టడీ సూచించింది.

News January 22, 2026

హీరో విజయ్ TVK పార్టీకి విజిల్ గుర్తు కేటాయింపు

image

తమిళ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. ఈమేరకు గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. త్వరలో తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఈ గుర్తుపై పోటీచేయనుంది.