News January 20, 2025

వెళ్తూ వెళ్తూ బైడెన్ సంచలన నిర్ణయం

image

మరికొద్ది గంటల్లో అధ్యక్షుడి కుర్చీ నుంచి దిగబోతున్న జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య నిపుణులు, కొవిడ్ రెస్పాన్స్ చీఫ్ డా.ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకు ముందస్తు క్షమాభిక్ష ప్రకటించారు. బైడెన్ తనకున్న అసాధారణ అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.

Similar News

News December 13, 2025

ఫేక్ డొనేషన్లతో క్లెయిమ్స్.. వారికి IT శాఖ హెచ్చరికలు

image

డొనేషన్ల పేరుతో బోగస్ క్లెయిమ్స్ చేసుకుంటున్న వారిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దృష్టిపెట్టింది. చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తమ ఆదాయపన్ను రిటర్నులను విత్ డ్రా చేసుకోవాలని, ITRలను అప్డేట్ చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు SMSలు, ఈమెయిల్స్ ద్వారా సమాచారమిస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులను రివైజ్ చేసినట్లు చెబుతోంది.

News December 13, 2025

21న 54 లక్షల మందికి పోలియో చుక్కలు

image

AP: నేష‌న‌ల్ ఇమ్యునైజేష‌న్‌ డే సందర్భంగా ఈనెల 21న రాష్ట్రంలో 54 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనికోసం 38,267 బూత్‌లు ఏర్పాటు చేసి 61,26,120 డోస్‌ల వ్యాక్సిన్‌ను రెడీ చేశామన్నారు. ఆరోజు చుక్కలు వేసుకోలేని పిల్ల‌లకు 22, 23 తేదీల్లో 76,534 బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.

News December 13, 2025

మరో ఘటన.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

image

AP: సత్యసాయి జిల్లా కదిరిలోని నిజాంవలి కాలనీలో కుక్క స్వైర విహారం చేసింది. వీధిలోని ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఆ పిల్లాడి చెవి సగానికిపైగా తెగిపోయింది. బాబుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూడా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై <<18545957>>కుక్క దాడి<<>> చేసి చెవి కొరికేసిన విషయం తెలిసిందే.