News April 1, 2024

BIG ALERT.. ఇవాళ, రేపు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Similar News

News February 1, 2026

T20 వరల్డ్ కప్‌కు సుందర్ రెడీ.. కెప్టెన్ సూర్య బిగ్ అప్‌డేట్!

image

గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్ కోలుకుంటున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరోక్షంగా ధ్రువీకరించారు. ఇప్పటికే ఆయన నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడని, ఆరోగ్యంగా కనిపిస్తున్నాడని సూర్య తెలిపారు. సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని CoEలో ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే తొలి మ్యాచ్ నాటికి ఆయన పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది.

News February 1, 2026

రాత్రిపూట చికెన్ తింటున్నారా?

image

సండే అంటేనే చాలామంది చికెన్ తిని చిల్ అవుతుంటారు. రాత్రి వేళ తిన్న వెంటనే రెస్ట్ తీసుకోవడం, నిద్ర పోవడం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్యులు. నాన్‌వెజ్ జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది కాబట్టి నిద్రకు 3Hrs ముందే భోజనం ముగించాలంటున్నారు. తిన్న వెంటనే పడుకోకుండా నడవాలని, హాట్ వాటర్, పుదీనా టీ తాగాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే అజీర్తి, గుండెలో మంట వంటి సమస్యలు రావని చెబుతున్నారు.

News February 1, 2026

బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్.. ‘ఆశ-నిరాశ’!

image

బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం మిశ్రమంగా స్పందించింది. మెట్రో, హైవే, రైల్వేల వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టుల వల్ల టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని నిపుణులు అంటున్నారు. కానీ అఫర్డబుల్ హౌసింగ్‌కు ఇన్సెంటివ్స్ లేకపోవడంపై CREDAI పెదవి విరిచింది. ఖర్చులు పెరిగి కొత్త ఇళ్ల నిర్మాణాలు పడిపోతాయని హెచ్చరించింది. ఇన్ఫ్రా వల్ల కొత్త ఏరియాలు డెవలప్ అయినా సామాన్యుడికి సొంతింటి కల దూరమవుతుందని పేర్కొంది.