News August 26, 2025
BIG ALERT.. అతి భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News August 26, 2025
రేపే వినాయక చవితి.. మార్కెట్లు రష్

వినాయక చవితికి మరొక్క రోజే మిగిలి ఉండటంతో మార్కెట్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. వినాయక ప్రతిమలు కొనేందుకు ప్రజలతో పాటు మండపాల నిర్వాహకులు విక్రయ షెడ్ల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వ్యాపారులతో బేరమాడి ఐడల్స్ కొంటున్నారు. అటు పూజకు అవసరమైన పత్రీలు, వస్తువులు, పూలు, పండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సామగ్రి కొనుగోలుదారులతో కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.
News August 26, 2025
యూరియా.. అన్నదాత ఆవేదన వినరా!

తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. రాత్రీపగలు తేడా లేకుండా అన్నదాతలు ఎరువుల దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. యూరియా పాపం కేంద్రానిదేనని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ సర్కారే కృత్రిమ కొరత సృష్టిస్తోందని BJP అంటోంది. ఇక యూరియా కొరతకు BJP, కాంగ్రెస్సే కారణమని BRS మండిపడుతోంది. ఇలాంటి రాజకీయ విమర్శలకే పరిమితమైన పార్టీలు రైతుల సమస్యకు మాత్రం పరిష్కారం చూపడం లేదు.
News August 26, 2025
200% టారిఫ్స్ విధిస్తాం.. చైనాకు ట్రంప్ వార్నింగ్

USకు చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సప్లై ఆపేస్తే 200% టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘వాళ్లు మాకు మ్యాగ్నెట్స్ ఇవ్వాల్సిందే. లేదంటే 200% టారిఫ్స్ విధించడం లేదా ఇంకేదైనా చేస్తాం. కానీ ఆ సమస్య రాదని భావిస్తున్నాం’ అని అన్నారు. త్వరలో చైనాలో పర్యటిస్తానంటూనే హెచ్చరించడం గమనార్హం. కాగా చైనాలోనే అత్యధికంగా ఉత్పత్తయ్యే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆటోమోటివ్, డిఫెన్స్ తదితర పరిశ్రమలకు కీలకం.