News December 12, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 PMT/PET పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.

Similar News

News December 13, 2024

రేపు, ఎల్లుండి పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చ

image

రాజ్యాంగంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్ వేదిక కానుంది. ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాజ్యాంగంపై ఇరు సభల్లో చర్చ జరగనుంది.

News December 13, 2024

నూతన సంవత్సర వేడుకలకు గైడ్ లైన్స్ జారీ

image

HYDలో నూతన సంవత్సర వేడుకలకు క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, 3 స్టార్ ఆపై హోటల్స్ నిర్వాహకులకు CP ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 31/JAN 1న రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే వేడుకలకు అనుమతి తప్పనిసరని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో రా.10గంటల వరకే DJ అనుమతిస్తామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరించారు. మద్యం పార్టీలకు ఎక్సైజ్ అనుమతి తప్పనిసరి అన్నారు.

News December 13, 2024

ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో రేపు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.