News October 12, 2024
డిగ్రీ పూర్తైన వారికి BIG ALERT
ఏపీలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ఓట్ల నమోదుకు ఈసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఉమ్మడి తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తైన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆధార్, డిగ్రీ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, ఫొటో సహా మరికొన్ని వివరాలను అప్లోడ్ చేయాలి. నవంబర్ 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఓటు నమోదు కోసం ఇక్కడ <
Similar News
News December 21, 2024
ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి: పవన్ కళ్యాణ్
AP: తాను కేవలం ఒక రోడ్డు వేయించి వెళ్లిపోనని, 5ఏళ్లు పని చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి (D) బల్లగరువులో పర్యటించిన ఆయన 100 కి.మీ. మేర 120 రోడ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇంతకు ముందు 250 మంది ఉంటే కానీ రోడ్లు పడేవి కాదని, కానీ 100 మంది ఉన్నా రోడ్డు వేయాలని PM మోదీ చెప్పడంతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలిపారు.
News December 21, 2024
మరికొన్ని గంటల్లో అద్భుతం
ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఎప్పటిలా కాకుండా ఈరోజు ముందుగానే రాత్రి కానుంది. భూభ్రమణంలో భాగంగా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య దూరం పెరిగి 16గంటల సుదీర్ఘ రాత్రి ఉండనుంది. ఈరోజు ఉదయం 7.10గంటలకు సూర్యుడు ఉదయించగా సూర్యకాంతి దాదాపు 8 గంటలే ఉండనుంది. ఇలా సుదీర్ఘ రాత్రి ఏర్పడే రోజు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
News December 21, 2024
పులివెందుల MLAకు జన్మదిన శుభాకాంక్షలు: నాగబాబు
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు జనసేన నేత నాగబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ‘X’లో పోస్ట్ చేశారు. జగన్కు సీఎం చంద్రబాబు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే.