News August 31, 2024
గ్రూప్-3 అభ్యర్థులకు BIG ALERT

TG: గ్రూప్-3 అభ్యర్థులకు TGPSC శుభవార్త అందించింది. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో సవరణ చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవాలని, మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది.
Similar News
News December 6, 2025
రేపు రాత్రిలోపు రీఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం ఆదేశం

టికెట్లు రద్దయిన ప్రయాణికులందరికీ ఆలస్యం లేకుండా రీఫండ్ చేయాలని ఇండిగోను కేంద్ర విమానయాన సంస్థ ఆదేశించింది. అందుకు రేపు రాత్రి 8 గంటల వరకు గడువు విధించింది. ప్రయాణికులకు ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రాసెస్లో అలసత్వం వహిస్తే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అటు ఇవాళ కూడా ఇండిగోకు చెందిన వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.
News December 6, 2025
సైబర్ మోసాల నుంచి రక్షణకు గూగుల్ కొత్త ఫీచర్

సైబర్ మోసాల బారిన పడి రోజూ అనేకమంది ₹లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎక్కువగా మొబైల్ యూజర్లు నష్టపోతున్నారు. దీనినుంచి రక్షణకు GOOGLE ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ‘ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్’ అనే ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీల యాప్లు తెరిచినప్పుడు, సేవ్ చేయని నంబర్ల కాల్స్ సమయంలో పనిచేస్తుంది. మోసపూరితమైతే స్క్రీన్పై హెచ్చరిస్తుంది. దీంతో కాల్ కట్ చేసి మోసం నుంచి బయటపడే అవకాశముంది.
News December 6, 2025
ఫిట్నెట్ సాధించిన గిల్.. టీ20లకు లైన్ క్లియర్!

IND టెస్ట్&ODI కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతడికి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 9 నుంచి SAతో జరిగే T20 సిరీస్కు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాయి. SAతో తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టు, ODIలకు గిల్ దూరమయ్యారు. ఫిట్నెస్ ఆధారంగా గిల్ <<18459762>>T20ల్లో<<>> ఆడతారని BCCI పేర్కొన్న సంగతి తెలిసిందే.


