News June 3, 2024

HDFC ఖాతాదారులకు బిగ్ అలర్ట్

image

ఈనెల 4, 6న రెండు గంటల చొప్పున HDFC డెబిట్(ATM), క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల సర్వీసులు నిలిచిపోనున్నాయి. 4న అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, 6న అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు సేవల్లో అంతరాయం కలగనున్నట్లు ఖాతాదారులకు HDFC మెసేజ్‌లు పంపిస్తోంది. ఆయా సమయాల్లో సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు పేర్కొంది. మరి ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

Similar News

News November 30, 2025

APPLY NOW: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech/ BE, MSc, MCA ఉత్తీర్ణులై, 22- 45ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.64,820- రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 30, 2025

సినిమా UPDATES

image

* త్రివిక్రమ్-వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ‘బంధుమిత్రుల అభినందనలతో’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
* రామ్ పోతినేని తన తదుపరి సినిమాను నూతన దర్శకుడు రామ్ కిశోర్‌తో చేస్తారని టాక్. 2026 జూన్‌కు షూటింగ్ కంప్లీట్ చేసి ఏడాది చివరికి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
* ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

News November 30, 2025

విశ్వాన్ని శాసించే విష్ణుమూర్తిని ఎందుకు పూజించాలి?

image

సర్వః శర్వః శివస్థ్సాణుః భూతాదిర్నిధి రవ్యయః|
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః||
సమస్త సృష్టికి మూలమైన, హింసను నశింపజేసే, శుభాన్ని కలిగించే దేవుడు విష్ణుమూర్తి. ఆయనే సమస్త భూతములకు ఆధారం. ఈ జగత్తును భరించే వ్యక్తి కూడా ఆయనే. అంతటి శక్తిమంతమైన దేవుడిని నిరంతరం స్మరిస్తే, మన జీవితంలో శుభం, స్థిరత్వం లభిస్తాయని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>