News April 7, 2024
MPC, BiPC విద్యార్థులకు BIG ALERT

TG: EAPCET-2024 దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లు సరిచేసుకునే అవకాశాన్ని JNTUH కల్పిస్తోంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు వెబ్సైటులో కరెక్షన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ ఐడీ, మొబైల్, పుట్టిన తేదీతో లాగిన్ కావాలి. అన్ని వివరాలు ఎడిట్ చేశాక.. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. అటు రూ.250 జరిమానాతో APR 9వ తేదీ వరకు, రూ.5000 ఫైన్తో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News November 28, 2025
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

అండాశయం (ఓవరీస్) నుంచి అండం గర్భసంచిలోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్స్ను ‘ఫెలోపియన్ ట్యూబ్స్’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండం గర్భసంచిలో బదులు ఈ ఫెలోపియన్ ట్యూబుల్లో పెరగడంతోపాటు ఒక్కోసారి అండాశయాల్లో (ఓవరీస్), కాస్తంత కిందికి వస్తే గర్భాశయ ముఖద్వారంలో, ఒక్కోసారి కడుపులో కూడా పెరగవచ్చు. ఈ సమస్యనే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’గా వ్యవహరిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు తల్లికి ప్రాణాపాయం సంభవిస్తుంది.
News November 28, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ హౌసింగ్ బ్యాంక్(<
News November 28, 2025
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మొదట్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కొందరిలో పీరియడ్స్ ఆగిపోవడం, వికారం ఉంటాయి. ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫలితాలు ‘పాజిటివ్’ అని వస్తాయి. రక్తస్రావం కావడం, పొత్తికడుపులో నొప్పి రావడం ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించాలి. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉన్నవాళ్లలో, లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశముంటుంది.


