News September 5, 2024
BIG ALERT: కాసేపట్లో భారీ వర్షం

TG: రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు గంటలపాటు కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News November 15, 2025
నిర్మాణాత్మక సంస్కరణలకు సిద్ధం: మంత్రి లోకేశ్

AP: ఏఐ మానవాళికి ముప్పుకాదని, అది హ్యుమానిటీని పెంచుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. CII సదస్సులో ‘AI-భవిష్యత్తులో ఉద్యోగాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. ‘ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తుందికానీ తొలగించదు. IT, ఫుడ్ ప్రాసెసింగ్లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.
News November 15, 2025
ఇకనైనా ‘వలస’ జీవులకు విముక్తి లభించేనా?

బిహార్లో మరోసారి ఎన్డీఏ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది తిరిగి తమ ఉపాధి క్షేత్రాలకు తిరిగిరానున్నారు. ఈక్రమంలో ఏళ్లు గడుస్తున్నా వలస జీవుల బతుకులు మారట్లేదని, ప్రజలకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇకనైనా కంపెనీలు నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు.
News November 15, 2025
APPLY NOW: RRUలో 9 పోస్టులు

గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<


