News June 11, 2024
BIG ALERT: ఇవాళ భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ TGలోని నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. APలోని అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


