News November 26, 2024
BIG ALERT.. భారీ వర్షాలు
బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం రేపటికి తుఫానుగా బలపడుతుందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు NLR, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఎల్లుండి కాకినాడ, కోనసీమ, కృష్ణా, NLR, YSR, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, TPTY జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంది.
Similar News
News November 26, 2024
₹3.5 కోట్ల జీతం మళ్లీ వదులుకున్న CEO
Zomato CEO దీపిందర్ గోయల్ ₹3.5 కోట్ల తన వార్షిక వేతనాన్ని మరో రెండేళ్లపాటు(2026 వరకు) వదులుకున్నారు. గోయల్ గతంలోనూ 2021 నుంచి 3 ఏళ్లపాటు జీతం తీసుకోకూడదని నిర్ణయించారు. కంపెనీ ఆర్థిక స్థిరత్వం, వ్యూహాత్మక లక్ష్యాలకు ప్రాధాన్యమివ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Zomatoలో దీపిందర్‌కు ఉన్న 4.16% వాటా విలువ దాదాపు ₹10 వేల కోట్లు ఉంటుందని అంచనా.
News November 26, 2024
ఏక్‌నాథ్ హైతో సేఫ్ హై.. CM పదవి కోసం పట్టువీడని శిండే వర్గం
మహారాష్ట్ర CM పదవి కోసం శివసేన శిండే వర్గం పట్టువీడటం లేదు. తాజాగా ఏక్‌నాథ్ శిండే ప్రచార బృందం వ్యూహాత్మక క్యాంపెయిన్‌ను జనంలోకి వదిలింది. ప్రధాని మోదీ నినదించిన ‘ఏక్ హైతో సేఫ్ హై’ను కాస్త ట్వీక్ చేసి ఏక్‌నాథ్ హైతో సేఫ్ హై అంటూ తన వాణిని బలంగా వినిపిస్తోంది. CM అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో శిండే వర్గం విశ్వప్రయత్నాల్లో ఉన్నట్టు ఈ ప్రచారం ద్వారా స్పష్టమవుతోంది.
News November 26, 2024
వెంటనే రైతుల అకౌంట్లోకి డబ్బులు: సీఎం
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు జరుగుతున్నాయి. సన్న రకాలకు ₹500 బోనస్ ఇవ్వాలి. రోజూ ధాన్యం కొనుగోళ్లపై నివేదిక ఇవ్వాలి’ అని CM సూచించారు.