News July 17, 2024
BIG ALERT: రేపటి నుంచి అతిభారీ వర్షాలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజులపాటు అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, MBNR, NZB, నిర్మల్, HMK, SDPT, NRPT, జగిత్యాల, సూర్యాపేట తదితర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
Similar News
News September 19, 2025
అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు: అమీషా

పెళ్లి తర్వాత వర్క్ చేయొద్దని కండిషన్స్ పెడుతుండటం వల్లే తాను ఇప్పటిదాకా వివాహం చేసుకోలేదని నటి అమీషా పటేల్ వెల్లడించారు. ’50 ఏళ్ల వయసులోనూ నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి. నా ఏజ్లో సగం వయసున్న వారూ డేట్కి రమ్మని అడుగుతుంటారు. సినిమాల్లోకి రాకముందు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నా. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లొద్దనడంతో వదులుకున్నా. సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధమే’ అని ఓ పాడ్కాస్ట్లో పేర్కొన్నారు.
News September 19, 2025
శాసనమండలి వాయిదా

AP: శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఆ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసనకు దిగారు. దీంతో శాసనమండలి వాయిదా పడింది.
News September 19, 2025
ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లు <<17674897>>వాహనమిత్ర <<>>పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. <<17731468>>అప్లికేషన్ ఫాంలను<<>> ఫిల్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి దసరా పండుగ రోజున ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తారు.