News August 21, 2024

BIG ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, VKB, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలులో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

Similar News

News November 20, 2025

బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్‌లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.

News November 20, 2025

ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

image

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News November 20, 2025

ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

image

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.