News September 21, 2024
BIG ALERT.. భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
Similar News
News December 3, 2025
IND vs SA.. రెండో వన్డేలో నమోదైన రికార్డులు

☛ వన్డేల్లో ఇది మూడో అత్యధిక ఛేజింగ్ స్కోర్ (359)
☛ వన్డేల్లో కోహ్లీ వరుసగా 2 మ్యాచుల్లో సెంచరీ చేయడం ఇది 11వ సారి
☛ SAపై అత్యధిక సెంచరీలు (7) చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
☛ 77 బంతుల్లో రుతురాజ్ సెంచరీ.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఇండియా బ్యాటర్‌కు ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. Y పఠాన్ (68బాల్స్) తొలి స్థానంలో ఉన్నారు.
☛ సచిన్ 34 వేర్వేరు వేదికల్లో ODI సెంచరీలు చేశారు. దానిని కోహ్లీ సమం చేశారు.
News December 3, 2025
రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం

ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆ జట్టులో మార్క్రమ్ (110) టాప్ స్కోరర్. IND బౌలర్లలో అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీయగా, హర్షిత్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. SA విజయంతో 3 మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే ఈ నెల 6న వైజాగ్‌లో జరగనుంది.
News December 3, 2025
TG హైకోర్టు న్యూస్

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా


