News November 19, 2024
BIG ALERT.. భారీ వర్షాలు
AP: నవంబర్ 21న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర నిర్వహణ శాఖ తెలిపింది. నవంబర్ 23 నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని, ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News November 19, 2024
World Workforce: 20% మనోళ్లే!
ప్రపంచ కార్మిక శక్తిలో భారత్ కీలకపాత్ర పోషించనుంది. 2023-50 మధ్య కాలంలో అత్యధికంగా 20% వర్క్‌ఫోర్స్‌ను కంట్రిబ్యూట్ చేయనున్నట్టు Angel One Wealth అంచనా వేసింది. అదే సమయంలో చైనా నిష్పత్తి తగ్గే పరిస్థితి ఉందని పేర్కొంది. భారత్‌లో అధిక ఆదాయ కుటుంబాల సంఖ్య 2030కి మూడింతలయ్యే అవకాశం ఉందని, ఇది వ్యక్తిగత ఆదాయ వృద్ధి దేశాల్లో భారత్‌ను ముందువరుసలో నిలుపుతుందని వివరించింది.
News November 19, 2024
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ డౌన్
ఈరోజు ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ డౌన్ అయింది. యూజర్ల నుంచి 1500కి పైగా ఫిర్యాదులు నమోదైనట్లు ఆన్లైన్ గ్లిచ్ పరిశీలన సంస్థ డౌన్‌డిటెక్టర్ తెలిపింది. 41శాతంమంది వినియోగదారులకు లాగిన్‌లో, మరో 41శాతంమంది సర్వర్ కనెక్షన్లలో ఇబ్బందులెదురైనట్లు పేర్కొంది. యాప్‌ను ఓపెన్ చేయలేకపోతున్నామని, మీడియా అప్లోడ్ చేయలేకపోతున్నామని అనేకమంది మెటాకు రిపోర్ట్ చేశారు.
News November 19, 2024
యూపీలో ఈ సారి దమ్ము చూపేదెవరు?
UPలో బుధవారం 9 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి. LS ఎన్నికల్లో SP అత్యధికంగా 37 సీట్లు గెలిచి BJPకి సవాల్ విసిరింది. దీంతో ఈ ఎన్నికల్ని BJP సవాల్‌గా తీసుకుంది. నలుగురు SP, ముగ్గురు BJP, RLD, నిషాద్ పార్టీ నుంచి ఒకరు MLAలుగా రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. విడిపోతే నష్టపోతాం అంటూ CM యోగి – పీడితులు, దళితులు, అల్పసంఖ్యాకుల ఐక్యత పేరుతో అఖిలేశ్ ప్రచారాన్ని నడిపారు.