News September 22, 2024
BIG ALERT.. 4 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.
Similar News
News December 1, 2025
NINలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్(NIN)లో 3 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3, 2 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఎస్సీ(నర్సింగ్, న్యూట్రీషన్, డైటెటిక్స్, హోమ్ సైన్స్, పబ్లిక్ హెల్త్ న్యూట్రీషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు mmp_555@yahoo.comకు దరఖాస్తును పంపాలి. projectsninoutsourcing@gmail.comలో సీసీ పెట్టాలి. వెబ్సైట్: https://www.nin.res.in
News December 1, 2025
రాజ్ నిడిమోరు గురించి తెలుసా?

రాజ్ నిడిమోరు తిరుపతిలో (1979) జన్మించారు. SVUలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. USలో ఉద్యోగం చేశారు. సినిమా కల నెరవేర్చుకునేందుకు ఫిల్మ్ మేకింగ్లోకి అడుగుపెట్టారు. 2002లో షాదీ.కామ్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్తో ఫేమస్ అయ్యారు. ఆ సిరీస్ సీజన్-2లో సమంత నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. తాజాగా వారు ఒక్కటయ్యారు.
News December 1, 2025
వయస్సును వెనక్కి తిప్పే బొటాక్స్

వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించేలా చేయడానికి అనేక రకాల చికిత్సలున్నాయి. వాటిల్లో ఒకటే బొటాక్స్. ముఖంపై ముడతలను పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరో టాక్సిన్ ప్రొటీన్ ఇది. దీనిని బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినమ్ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. దీనిని మన కండరాల్లోకి చొప్పిస్తే చర్మంపై గీతలు, ముడతలు తగ్గి మృదువుగా కనిపిస్తుంది. సంవత్సరానికి 2-3 మూడు ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది.


