News October 14, 2024
BIG ALERT.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, NLR, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, YSR, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.
Similar News
News February 2, 2026
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో నల్లపాడు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.
News February 2, 2026
అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య: పోలీసులు

AP: అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ‘అంబటిపై 16 కేసులు ఉన్నాయి. సీఎం చంద్రబాబును అసభ్యంగా దూషించారు. పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు. అరెస్టు చేయకపోతే అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అంబటిని 14 రోజులపాటు రిమాండ్ ఇవ్వాలి. లేదంటే ఆయనకు ప్రాణహాని ఉంది’ అని పేర్కొన్నారు. కాసేపట్లో మేజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు.
News February 2, 2026
ఇది డైవర్షన్, సబ్‌వర్షన్, పర్వర్షన్ ప్రభుత్వం: KTR

TG: కేంద్రంతో పోరాడి నిధులు సాధించడంలో INC ప్రభుత్వం విఫలమైందని KTR విమర్శించారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే KCRను సిట్ విచారణకు పిలిచి నాటకాలు చేశారన్నారు. ‘ఇది డైవర్షన్, సబ్‌వర్షన్, పర్వర్షన్ ప్రభుత్వం. CM రేవంత్ గాలి మాటలు మాట్లాడుతూ గాల్లో తిరుగుతున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా డ్రామా చేస్తున్నారు. విచారణ చేసేది సిట్టా, పీసీసీనా, బీజేపీనా అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.


