News December 19, 2024
BIG ALERT.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోందని APSDMA తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉ.తమిళనాడు, ద.కోస్తా తీరం వైపు, ఆ తర్వాత ఉత్తరం దిశగా AP తీరం వెంబడి పయనిస్తుందని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, VZM, అల్లూరి, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
Similar News
News October 16, 2025
PIC OF THE DAY

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటో వైరలవుతోంది. PIC OF THE DAY అని పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా ‘నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించా. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.
News October 16, 2025
PHOTO GALLERY: శ్రీశైలంలో PM మోదీ

AP: ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న సేవలో తరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. శ్రీశైల ఆలయంలో మోదీ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News October 16, 2025
రబీ పంటగా ఉలవల సాగు- అనువైన రకాలు

ఉలవలను సాధారణంగా లేట్ ఖరీఫ్/రబీకి ముందు, రబీలో పండించవచ్చు. వీటిని నీటి లభ్యతను బట్టి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. P.D.M-1, P.Z.M-1, P.H.G-62 రకాలు సాగుకు అనుకూలం. సాళ్ల పద్ధతిలో గొర్రుతో విత్తేటప్పుడు ఎకరాకు 8-10 కిలోలు, వెదజల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12-15 కిలోల విత్తనం అవసరం. ప్రతి కిలో విత్తనాన్ని కార్బండిజమ్ 1గ్రా. లేదా థైరమ్ 3గ్రా.తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.