News November 12, 2024

BIG ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని <>APSDMA<<>> వెల్లడించింది. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది.

Similar News

News October 29, 2025

దేవుడు ఎవరిపై అనుగ్రహం చూపుతాడంటే?

image

‘భక్త్యాత్యనన్యయా శక్యః’ అంటుంది భగవద్గీత. అంటే అనన్య భక్తి కల్గిన వారికే దేవుడు స్వాధీనమవుతాడని అర్థం. ఎలాంటి ఆశలు లేకుండా, కేవలం భగవంతుడిపైనే విశ్వాసం ఉంచి, ఆయనతో నిలబడే భక్తులపైనే ఆయన అనుగ్రహం ఉంటుంది. అనన్య భక్తితో పూజ, సేవ, నామస్మరణ, కీర్తన, జపం, ధ్యానం వంటి సాధనలు చేసే వారికి, ఆ దేవుడు కేవలం స్వామీ, రక్షకుడే కాకుండా, వారి హృదయాలలో సులభంగా లభించేవాడుగా, స్వాధీనమయ్యేవాడుగా ఉంటాడు. <<-se>>#WhoIsGod<<>>

News October 29, 2025

ఇందిరా గాంధీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని ఇందిరా గాంధీ హాస్పిటల్‌ 26 రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్తీషియా, జనరల్ సర్జరీ, గైనకాలజీ, రేడియో-డయాగ్నోసిస్ ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7 వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. వెబ్‌సైట్: https://igh.delhi.gov.in/

News October 29, 2025

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని IMD తెలిపింది. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, టీజీలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కాగా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.