News June 2, 2024
BIG ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో అక్కడక్కడా 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 40-50Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.
Similar News
News January 10, 2026
చిట్లిన కురులను ఇలా సరిచేద్దాం..

మారిన జీవనశైలి వల్ల చాలామంది అనేక జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో జుట్టు చివర్లు చిట్లి గడ్డిలా కనిపిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొబ్బరినూనెలో కొద్దిగా రోజ్మేరీ ఆయిల్, ఆముదం కలిపి రాయాలని చెబుతున్నారు నిపుణులు. వీటిలో ఉండే వివిధ రకాల పోషకాలు జుట్టుకి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తాయి. అలాగే అరటిపండ్లు, తేనె, పెరుగు ఎక్కువగా తింటే జుట్టు రాలడం తగ్గుతుందంటున్నారు.
News January 10, 2026
WPL: ఇవాళ డబుల్ ధమాకా

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. టోర్నీలో 5 జట్లే పాల్గొంటుండటంతో టీమ్లు వరుస రోజుల్లో మ్యాచులు ఆడే పరిస్థితి ఏర్పడింది. నిన్న తొలి మ్యాచులో RCB చేతిలో <<18814463>>ఓడిన<<>> ముంబై ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ను ఎదుర్కోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచులో గుజరాత్-యూపీ వారియర్స్ తలపడతాయి. హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ చూడవచ్చు.
News January 10, 2026
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు

TG: నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. గ్రూప్స్ ద్వారా ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాగా ఇటీవల జాబ్ క్యాలెండర్ కోరుతూ విద్యార్థులు <<18794438>>ఆందోళన<<>> చేపట్టిన విషయం తెలిసిందే.


