News August 16, 2025

BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. TGలోని నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, SRD, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే ASF, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, PDPL, MHBD, WGL, VKB, MDK జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Similar News

News August 16, 2025

అటకెక్కిన ‘దేవర-2’!

image

NTR, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’కు కొనసాగింపుగా తీసే పార్ట్-2 అటకెక్కినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ మూవీ తీసేందుకు NTR కమిట్ అయ్యారని, దీంతో దేవర-2 పట్టాలెక్కడం కష్టమేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూవీ రద్దు విషయమై హీరో, దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరిగాయట. మరోవైపు నాగచైతన్యతో కొరటాల కొత్త స్క్రిప్ట్‌తో మూవీ తెరకెక్కిస్తారని సమాచారం.

News August 16, 2025

రేపు ఈసీ ప్రెస్ మీట్.. రీజన్ అదేనా?

image

భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ‘ఓట్ చోరీ’ అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ కారణంగానే పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఓడారని ఆయన ఆరోపించారు.

News August 16, 2025

‘OG’లో కన్మని ఎవరంటే?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమాలో నటిస్తోన్న ప్రియాంకా మోహన్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె కన్మని పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే.