News September 12, 2025
BIG ALERT: రేపు అతిభారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News April 9, 2026
15 రోజులు షూటింగ్.. 15 రోజులు రేసింగ్

ఏడాది తర్వాత తమిళ నటుడు అజిత్ ఓ మూవీకి ఓకే చెప్పారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో సినిమా చేయబోతున్నారు. మే తొలివారంలో షూటింగ్ ఆరంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే తనకిష్టమైన 2 ప్యాషన్స్‌ను బ్యాలెన్స్ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట. నెలలో 15రోజులు షూటింగ్, 15రోజులు రేసింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
News April 9, 2026
భారత తొలి టెస్ట్ విన్నింగ్ టీమ్ ఆఖరి ప్లేయర్ మృతి

భారత్ టెస్ట్ దిగ్గజం CD గోపీనాథ్ (96) కన్నుమూశారు. చెన్నైలోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1951-52లో ENGతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆయన సెకండ్ టెస్ట్‌లో 50, 42 స్కోర్స్ చేశారు. ఈ 5 మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో IND చెన్నైలో జరిగిన ఆఖరి టెస్ట్‌లో గెలుపొంది తన తొలి టెస్ట్ విక్టరీ నమోదు చేసింది. ఆ జట్టులో ఇప్పటివరకు జీవించిన ఆఖరి ప్లేయర్ గోపీనాథ్ ఒక్కరే కావడం గమనార్హం.
News April 9, 2026
IMDb టాప్-5 బెస్ట్ IPL మ్యాచులివే..

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ IMDb.. IPLలో టాప్-5 మ్యాచుల జాబితాను విడుదల చేసింది.
టాప్-1: 2019 MI-CSK థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్
టాప్-2: 2023లో GTపై KKR ప్లేయర్ రింకూ సింగ్ 5 సిక్సర్లు బాదిన గేమ్
టాప్-3: 2014లో RR విధించిన 190 రన్స్ టార్గెట్‌ను MI 14.4 ఓవర్లలోనే ఛేదించిన మ్యాచ్
టాప్-4: 2017 ఫైనల్లో RPSపై ఒక్క రన్ తేడాతో గెలిచిన MI మ్యాచ్
టాప్-5: 2023 ఫైనల్లో GTపై CSK థ్రిల్లింగ్ విక్టరీ


