News May 18, 2024
BIG ALERT.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మే 24 నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Similar News
News November 17, 2025
హనుమాన్ చాలీసా భావం – 12

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 17, 2025
వర్కింగ్ ఉమెన్ విజయం సాధించాలంటే..

ఉద్యోగం చేసే ప్రతి మహిళా ఉన్నత స్థానానికి ఎదగాలనే కోరుకుంటుంది. దీనికోసం పనులను వేగంగా, సంపూర్ణంగా చేయడం నేర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఇంటాబయటా ఉత్సాహంగా అన్ని పనులూ చేయగలరు. కాబట్టి రోజూ కనీసం ఓ గంట వ్యాయామం, యోగాకి కేటాయించాలి. రేపు చేయాల్సిన పనుల జాబితాను ముందే రాసుకుంటే ఏం చేయాలనేదానిపై స్పష్టత వస్తుంది. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆఫీసుకు వచ్చాక కేవలం పని మీదే దృష్టి సారించాలి.