News July 14, 2024

BIG ALERT.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, NLG, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, SRD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News November 18, 2025

హిడ్మా మృతదేహం (photo)

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు <<18318593>>హిడ్మా<<>> ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం కాగా ఆయన మృతదేహం ఫొటో బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

కడుపులోనే కవలలు, భార్య మృతి.. భర్త ఆత్మహత్య

image

AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విజయ్‌-శ్రావ్య దంపతుల కథ విషాదాంతమైంది. 8 ఏళ్ల క్రితం పెళ్లి కాగా HYDలో అద్దెకు ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో IVF ద్వారా శ్రావ్య గర్భం దాల్చింది. 8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్య కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా గర్భంలోని కవలలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా చనిపోయింది. ఈ విషాదాన్ని తట్టుకోలేని విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.