News November 9, 2024

1520 ఉద్యోగాలపై BIG ALERT

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్‌డేట్‌ను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. డిసెంబర్ 29న CBT విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. గతంలో విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తైంది. అటు రేపు జరిగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించింది.

Similar News

News February 11, 2026

GAIL(INDIA) లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>GAIL(<<>>INDIA) లిమిటెడ్‌ 3 SDMO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS అర్హతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు మార్చి 5 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 56ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,04,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.gailonline.com

News February 11, 2026

నలుగురు మంత్రులకు బెదిరింపులు

image

AP: రాష్ట్ర మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు వచ్చాయి. కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. కందుల దుర్గేశ్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 11, 2026

11-11-11 అంటూ వైసీపీ MLAలపై స్పీకర్ సెటైర్లు

image

AP: అసెంబ్లీ లాబీలో వైసీపీ MLAలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా వైసీపీ నేతలు సభ నుంచి <<19108172>>బయటకు<<>> వెళ్లిపోయారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై సభలో చర్చకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.