News November 29, 2024
BIG ALERT: మరికొన్ని గంటల్లో తుఫాను.. ప్రమాద హెచ్చరికలు జారీ

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫాను(ఫెంగల్)గా మారనుందని IMD తెలిపింది. రేపు కారైకాల్-మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కోస్తాలో 55-75Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం వద్ద మూడో నంబర్, మిగిలిన పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News December 1, 2025
‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్‌తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.
News December 1, 2025
హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్‌తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 1, 2025
‘హిల్ట్’పై గవర్నర్‌కు BJP ఫిర్యాదు

TG: ‘హిల్ట్’ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని BJP గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. 9,292.53 ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకే అప్పగిస్తోందని, దీనివెనుక ₹5లక్షల CR స్కామ్ ఉందని ఆరోపించింది. వెంటనే జోక్యం చేసుకొని భూములను పరిరక్షించాలంది. ‘హిల్ట్’ను రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని పార్టీ చీఫ్ రామచందర్‌రావు, LP నేత మహేశ్వర్ రెడ్డి గవర్నర్‌కు అందించిన వినతిలో కోరారు.


