News October 22, 2024
BIG ALERT: తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది. రేపు తుఫాన్‌గా బలపడనుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. OCT 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈ నెల 25 వరకు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Similar News
News November 27, 2025
NZSR ఉన్నప్పటికీ దాని ద్వారా జుక్కల్‌కు ప్రయోజనం లేని పరిస్థితి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ జుక్కల్ నియోజకవర్గానికి ప్రయోజనం లేని పరిస్థితి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చే వ్యవస్థ చాలా తక్కువగా ఉందన్నారు. MHతో పంచాయతీ కారణంగా లెండి ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కాకుండా ఉందని ఆరోపించారు.
News November 27, 2025
మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్

పది రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్ చేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో AP, TG, MH, MP, UP, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్‌లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. గతంలో అధికారులకు లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీల్లో జరిగిన తనిఖీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయా యాజమాన్యాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఈ ఏడాది జూన్‌లో FIR నమోదైంది.
News November 27, 2025
డబ్బులిస్తే జాబ్ వస్తుందా?.. ఇకనైనా మారండి!

HYDలో ఓ నకిలీ IT కంపెనీ ఉద్యోగాల పేరిట 400 మంది నిరుద్యోగులను మోసగించింది. జాబ్ గ్యారెంటీ పేరుతో రూ.3లక్షల చొప్పున వసూలు చేసింది. ఇలా మోసపోవద్దంటే.. తప్పుదోవలో ఉద్యోగం కోసం వెతక్కుండా స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. ఏ కంపెనీ కూడా డబ్బు తీసుకొని జాబ్ ఇవ్వదు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు నేర్చుకుంటే, మీ అర్హత, స్కిల్స్ ఆధారంగా ఉద్యోగం సాధించవచ్చు. నైపుణ్యం ఉంటే ఉద్యోగం మీదే.


