News October 20, 2024
BIG ALERT: తుఫాన్ ముప్పు.. 5 రోజులు వర్షాలు

AP: అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని IMD వెల్లడించింది. ఇది 23వ తేదీకి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో నేటి నుంచి 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో 24-26 మధ్య తుఫాన్ తీరం దాటుతుందని వివరించింది. ఈ నెల 29న, NOV 3న కూడా అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉందంది.
Similar News
News December 8, 2025
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి

TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇటీవల ఉమ్మడి MBNR జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
News December 8, 2025
RITESలో 400 పోస్టులు.. అప్లై చేశారా?

RITES 400 కాంట్రాక్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు కోరుతోంది. ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 25వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ. 42,478 చెల్లిస్తారు. జనవరి 11న రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 8, 2025
భారీ జీతంతో AMPRIలో 20 పోస్టులు.. అప్లై చేశారా?

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(AMPRI)లో 20సైంటిస్ట్, Sr సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.TECH, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన సైంటిస్ట్‌కు నెలకు రూ.1,26,900, Sr సైంటిస్ట్‌కు రూ.1,46,770 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in/


