News February 13, 2026
BIG BREAKING: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో హంగ్

ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించినట్లుగానే హంగ్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 20 వార్డుల్లో BRS 9 స్థానాలు, కాంగ్రెస్ 7 వార్డుల్లో గెలవగా, నలుగురు స్వతంత్రులు విజేతలుగా నిలిచారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరఫున ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ, మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి మరో సభ్యుని మద్దతు అవసరం. దీంతో స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారారు.
Similar News
News March 11, 2026
MBNR: లిఫ్ట్ ఇచ్చి మహిళపై సామూహిక అత్యాచారం

ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగు చూసింది. స్థానికుల వివరాలు.. పట్టణానికి చెందిన ఓ మహిళ రాత్రి రోడ్డుపై వెళ్తున్న బైకర్స్‌ను లిఫ్ట్ అడిగింది. బైక్‌పైఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకుని మున్సిపాలిటీని దాటగానే బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై ఇద్దరు యువకులు వరుసగా అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ నేరుగా PSకు చేరుకొని ఫిర్యాదు చేసింది.
News March 11, 2026
ట్రంప్ కీలక నిర్ణయం.. రిలయన్స్‌తో భారీ డీల్

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైనింగ్ ప్రాజెక్టును అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత USలో ఏర్పాటవుతున్న తొలి రిఫైనరీ ఇదే. ఈ $300 బిలియన్ల ప్రాజెక్టులో రిలయన్స్ పార్ట్‌నర్‌గా చేరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందుకు కంపెనీకి థాంక్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే క్లీన్లీయెస్ట్ రిఫైనరీ అని, వేలాది ఉద్యోగాలు రావడమే కాకుండా అమెరికా ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుందని పేర్కొన్నారు.
News March 11, 2026
TU: “అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నావెల్ థెరాప్టిక్స్” పై జాతీయ సదస్సు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో “అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నావెల్ థెరాప్టిక్స్” అనే అంశంపై ఈ నెల 23,24 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డా.చంద్రశేఖర్ తెలిపారు. సందర్భంగా జాతీయ సదస్సు బ్రోచర్లను ఉపకులపతి ఆచార్య యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. అధ్యాపకులు సత్యనారాయణ, శిరీష, ప్రసన్న శీల పాల్గొన్నారు.


