News April 2, 2024

BIG BREAKING: కాటసాని చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇటు పాణ్యం అటు బనగానపల్లె నియోజకవర్గాల్లో కాటసాని బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Similar News

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం.. యువతి మృతి

image

ఆదోని–సిరుగుప్ప రహదారిలోని లక్ష్మమ్మ వేర్ హౌస్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి వస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక యువతి మరణించగా, మరో ఇద్దరు యువతులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్వీ పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2026

ఆదోని ఎమ్మెల్యే చుట్టూ వివాదం.. పోస్టర్లు వైరల్

image

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ నేత సౌదీ రావుఫ్ రూ.10 లక్షల లంచం నిజమేనని, ఈ పోస్టర్ల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

News April 10, 2026

చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించండి: కలెక్టర్

image

కర్నూలు నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సందర్శించారు. నగర కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీవోతో కలిసి చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. యార్డ్‌లో అమలవుతున్న నిర్వహణ పద్ధతులను అధికారులతో సమీక్షించారు. మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు.