News April 22, 2025
BIG BREAKING: ఫలితాలు వచ్చేశాయ్

TG: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వచ్చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో రిజల్ట్స్ స్క్రీన్‌లో ఫలితాలు పొందవచ్చు. అందులో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
Similar News
News December 21, 2025
సండే స్పెషల్.. OTTలో ఈ సినిమా చూశారా?

ప్రియదర్శి, ఆనంది కాంబినేషన్లో తెరకెక్కిన ‘ప్రేమంటే’ చిత్రం NETFLIXలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో భార్యాభర్తలుగా హీరోహీరోయిన్ల నటన మెప్పిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్లస్. వెన్నెల కిశోర్, యాంకర్ సుమ రోల్స్ నవ్వులు పూయిస్తాయి. ఈ డీసెంట్ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చు. కాగా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడంతో థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది.
News December 21, 2025
VB-G RAM G బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

VB-G RAM G బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవించే పేదలకు 125 రోజుల పనిదినాలను ఈ పథకం కింద అందిస్తారు. ఫారెస్ట్ ఏరియాల్లో జీవించే షెడ్యూల్ ట్రైబల్ కమ్యూనిటీలకు 150పనిదినాలు కల్పించేలా చట్టంలో NDA ప్రభుత్వం మార్పులు చేసింది. UPA హయాంలో 100రోజుల కనీస పనిదినాల లక్ష్యంతో తీసుకొచ్చిన MGNREGA పథకాన్ని కేంద్రం ఇటీవల రద్దు చేయడం తెలిసిందే.
News December 21, 2025
పోలీసులకు ఒక్క రోజులోనే రుణాలు!

AP: పోలీసు సిబ్బంది సంక్షేమానికి కీలక ముందడుగు పడింది. సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా మారుస్తూ ఏపీ DGP హరీశ్‌కుమార్ గుప్తా ‘APOLIS’ ఆటోమేటెడ్ లోన్ సిస్టమ్‌ను ప్రారంభించారు. గతంలో 3 నెలలు సమయం పట్టే రుణ మంజూరు ఇకపై కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. లోన్లు, సెలవులు, పేస్లిప్స్ వంటి వివరాలు ‘APOLIS’ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని డీజీపీ తెలిపారు.


