News February 13, 2026

BIG BREAKING: భైంసాలో హంగ్

image

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 26 వార్డులకు గాను MIM 12, ఇండిపెండెంట్-7, BJP-6, కాంగ్రెస్ 1 వార్డు గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 14 ఎవరూ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. వీరిలో ఇద్దరు MIMకి మద్దతు తెలిపితే ఆ పార్టీ భైంసా ఛైర్మన్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News March 15, 2026

ప.గో: కన్నతల్లిని చంపిన కొడుకుకి యావజ్జీవ శిక్ష

image

కన్నతల్లిని అతికిరాతకంగా హతమార్చిన కుమారుడికి భీమవరం మూడో అదనపు కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పాలకోడేరుకు చెందిన నమ్మి రవి గత ఏడాది మే నెలలో తన తల్లి రాజ్యలక్ష్మిపై పదునైన కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. పోలీసులు సేకరించిన పక్కా ఆధారాలతో నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

News March 15, 2026

ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

image

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.

News March 15, 2026

సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

image

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.