News March 21, 2025
BIG BREAKING: మంత్రి ఫరూక్ సతీమణి మృతి

న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని వారి ఇంట్లోనే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు.
Similar News
News January 3, 2026
HYD: లీకేజీలను గుర్తించేంచుకు ‘రోబోటిక్’ టెక్నాలజీ

HYDలో కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. గత రెండేళ్లలో అందిన ఫిర్యాదులను విశ్లేషించి, కలుషిత నీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల్లోగా పాత పైప్‌లైన్లను మార్చాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. లీకేజీలను త్వరితగతిన గుర్తించేందుకు ‘రోబోటిక్ టెక్నాలజీ’ని వాడుతున్నారు. ఫిర్యాదులను ‘జీరో’ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టారు.
News January 3, 2026
వనపర్తి: ‘నిబంధనలు పాటిస్తేనే భద్రత’

18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని వనపర్తి డీటీఓ మానస సూచించారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు త్వరలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు డీటీఓ కార్యాలయం నుంచి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం సాగించాలని కోరారు.
News January 3, 2026
ఈనెల 5న జిల్లాలోని రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు: కలెక్టర్

ఈనెల 5న జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ‘రెవెన్యూ క్లినిక్స్’ కార్యక్రమాన్ని పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పుట్టపర్తి, కదిరి, మడకశిర, ధర్మవరం, పెనుకొండ డివిజన్ కేంద్రాలలో కార్యక్రమాన్ని RDOలు నిర్వహించాలన్నారు.


