News March 21, 2025

BIG BREAKING: మంత్రి ఫరూక్ సతీమణి మృతి

image

న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని వారి ఇంట్లోనే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు.

Similar News

News April 18, 2025

అరుదైన ఘనత సాధించిన హెడ్

image

IPL: వాంఖడేలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్‌వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.

News April 18, 2025

ADB: రాష్ట్ర మంత్రి పర్యటన షెడ్యూల్ ఇదే

image

ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు స్థానిక ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంలో హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 2:00 గంటలకు భోరజ్ మండలం పూసాయిలో నిర్వహించనున్న భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటలకు మావలలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

News April 18, 2025

MNCL: ఎల్లుండి నుంచే పరీక్షలు.. చదువుకున్నారా..?

image

జిల్లాలో పది, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పదో తరగతి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఇంటర్ పరీక్షలు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,192 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. విద్యార్థులు గంట ముందు సెంటర్లకు హాజరు కావాలని సూచించారు.

error: Content is protected !!