News February 13, 2026
BIG BREAKING: వరంగల్: తొలి మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 6 వార్డులు BRS, 1 వార్డు ఇతరులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News March 14, 2026
పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జంగేడు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం తనిఖీ చేశారు. పరీక్షా నిర్వహణ తీరు, కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షా హాళ్లను సందర్శించి, విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News March 14, 2026
మొదటి రోజు 99.9 శాతం హాజరు: డీఈవో

వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరు కాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 99.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో రంగయ్య వెల్లడించారు.
News March 14, 2026
గారలో బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన జపనీస్

గార మండలం సాలిహుండం బౌద్ధక్షేత్రాన్ని జపాన్ దేశానికి చెందిన బృందం నేడు సందర్శించారు. ప్రాచీన బౌద్ధ స్మారకాలు, స్థూపాల అవశేషాలను ఆసక్తిగా పరిశీలించి వాటి చారిత్రక ప్రాముఖ్యతపై తెలుసుకున్నారు. ఈ సందర్శనతో సాలిహుండం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానికులంటున్నారు. ప్రజలు, ప్రతినిధులను వీరిని ఆత్మీయంగా ఆహ్వానించారు.


