News February 13, 2026

BIG BREAKING: నిజామాబాద్: తొలి మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 10 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 2 వార్డులు BRS గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Similar News

News February 14, 2026

NTR: మృత్యువుకు బ్రేక్ వేసిన పోలీసులు.. ముగ్గురు సేఫ్

image

కుటుంబ కలహాలతో పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు కాపాడారు. చిలకలపూడికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకబోతుండగా ట్రాఫిక్ RSI శ్రీధర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భూషణం సకాలంలో స్పందించి వారిని అడ్డుకున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించి, తదుపరి చర్యల నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల సమయస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News February 14, 2026

కుప్పం DSP పై శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

image

కుప్పం DSP పై MLC భరత్ శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కుప్పం నియోజకవర్గంలో అత్యవసర ప్రజా ఫిర్యాదులు, శాంతిభద్రతల సమస్యలను చర్చించేందుకు DSPకి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని, ప్రోటోకాల్‌కు సంబంధించి ప్రభుత్వ స్టాండింగ్ ఆర్డర్‌లను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తుకు ప్రివిలేజ్ కమిటీని పంపాలని, కుప్పం DSP పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 14, 2026

ప్రొద్దుటూరు: పెట్రోల్ బంక్ స్కాంలో చెక్ బౌన్స్ కేసు.?

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. వీటిపై చెక్ బౌన్స్ కేసు పెట్టనున్నారు. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ బకాయిలకు సంబంధించి సుమారు రూ.50 లక్షల విలువైన 10 చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశాడు. ఈ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయని అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ తెలిపారు. పెట్రోల్ బంక్ బకాయిలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపామని కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు.