News October 23, 2025
BIG BREAKING: బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. అరెస్ట్

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (వెస్ట్ జోన్), బంజారాహిల్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో నిర్వాహకుడు, సెలూన్ వ్యాపారి మహమ్మద్ షరీఫ్, కర్నూలుకు చెందిన ఏడుగురు కస్టమర్లు, హోటల్ రిసెప్షనిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
Similar News
News October 23, 2025
HYD: రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలు.. మహిళల అరెస్ట్

HYD కూకట్‌పల్లి PS పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో ఎస్ఐ నరసింహ ఆధ్వర్యంలో పది మంది మహిళలను అరెస్ట్ చేశారు. రోడ్లపైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. పది మందిని స్థానిక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, సత్ప్రవర్తనలో భాగంగా బైండ్ ఓవర్ చేయగా ఇద్దరు మహిళలను 7 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు.
News October 23, 2025
HYD: శంషాబాద్‌లో దారుణం.. బాలికపై అత్యాచారం

మంచినీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చిన ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన HYD శంషాబాద్ PS పరిధిలో జరిగింది. శంషాబాద్ మండలం పిల్లోనిగూడ గ్రామానికి చెందిన దళిత బాలికపై ఈనెల 18వ తేదీన యువకుడు నవీన్ ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. గురువారం విషయం వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు.
News October 23, 2025
BREAKING: HYD: బేగంపేట్‌లో MURDER

HYD బేగంపేట్‌లోని గ్రీన్‌ల్యాండ్ ప్రాంతంలో అస్సాంకు చెందిన ఓ మహిళ మృతి స్థానికంగా కలకలం రేపింది. ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో దీనిని హత్యగా పోలీసులు నిర్ధారించారు. స్థానిక టీస్టాల్ యజమాని పొటమచెట్టి పండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎం.రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. హత్యకు సంబంధించిన విషయాలపై అనుమానితుల విచారణ ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.