News March 21, 2025

BIG BREAKING: మంత్రి ఫరూక్ సతీమణి మృతి

image

న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని వారి ఇంట్లోనే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు.

Similar News

News March 28, 2025

BREAKING: లక్నో చేతిలో SRH ఓటమి

image

IPL-2025: ఈ సీజన్లో SRHకు తొలి ఓటమి ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో SRHపై లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 16.1 ఓవర్లలోనే సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. పూరన్ 26 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 70 రన్స్ చేసి మ్యాచును తమవైపు లాగేశారు. ఓపెనర్ మార్ష్ (52) హాఫ్ సెంచరీతో రాణించారు. కమిన్స్ రెండు వికెట్లు తీశారు.

News March 28, 2025

జగిత్యాల మార్కెట్ ధరల సమాచారం మీ కోసం

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,215, కనిష్ట ధర రూ. 1,918లుగా పలికాయి. అటు కందులు గరిష్ఠ ధర రూ. 6,495, కనిష్ఠ ధర రూ. 5,500, అనుములు రూ. 4896, పసుపు కాడి గరిష్ఠ ధర రూ. 11,000, కనిష్ఠ ధర రూ. 7,000, పసుపు గోళం గరిష్ఠ ధర రూ. 9,500, కనిష్ఠ ధర రూ. 5,000, వరి ధాన్యం (జైశ్రీరాం రకం) రూ. 2,311లుగా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

News March 28, 2025

జగిత్యాల జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో నేటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గోదూరులో 40.9℃, వెల్గటూర్, సిరికొండ 40.7, రాఘవపేట, ఐలాపూర్ 40.6, నేరెల్లా, మన్నెగూడెం 40.5, రాయికల్, సారంగాపూర్ 40.4, అల్లీపూర్ 40.3, బుద్దేష్‌పల్లి 40.1, మేడిపల్లె, జైన 40, మెట్‌పల్లె, మల్లాపూర్ 39.9, కోరుట్ల 39.8, జగ్గసాగర్, గొల్లపల్లె 39.6, మారేడుపల్లి 39.2, పెగడపల్లె, కథలాపూర్ 39.1, గుల్లకోటలో 38.9℃ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!