News March 16, 2026
BIG BREAKING: ADB: మాజీ MLA మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మాజీ MLA అజ్మీరా గోవింద్ నాయక్ కాసేపటి క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం ఆయన దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఉన్న తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3 సార్లు MLAగా గెలుపొందారు. మొదటి సారి ఇండిపెండెంట్‌గా గెలవగా ఆ తర్వాత TDP, BRS నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంత కాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యారు.
Similar News
News March 28, 2026
కాకినాడ: ఆన్‌లైన్ అప్పులు కట్టలేక MBA స్టూడెంట్ ఆత్మహత్య

గండేపల్లి మండలం సూరంపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్‌లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) ఓ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అప్పు ఒత్తిడి తట్టుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక మనస్తాపానికి గురై తన గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 28, 2026
టార్గెట్ 300.. ఏ టీమ్ కొడుతుందో?

కొన్నేళ్లుగా IPL టీమ్‌లను ఊరిస్తున్న స్కోర్ 300. ఈసారి ఆ స్కోర్ గ్యారంటీ అంటూ SRH కెప్టెన్ ఇషాన్ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లే జట్టులో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్, లివింగ్‌స్టోన్ వంటి హిట్టర్లున్నారు. IPLలో టాప్ 5 హయ్యెస్ట్ స్కోర్ల(287/3, 286/6, 278/3, 277/3, 272/7)లో తొలి 4 SRHవే. మిగతా జట్లలోనూ భీకర బ్యాటర్లున్నారు. మరి ఈ సీజన్‌లో 300ను ఏ జట్టు కొట్టగలదో కామెంట్ చేయండి.
News March 28, 2026
నరసాపురం: కారు ఇప్పిస్తానని బంధువుకే టోకరా..!

తక్కువ ధరకే కారు కొనిపిస్తానని నమ్మించి రూ.4.50 లక్షలు కాజేసిన వ్యక్తిపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ముత్యాలరావు వివరాలు.. బాధితుడు యర్లగడ్డ ప్రదీప్ కుమార్‌కు బంధువైన గాబ్రియేల్ రాజు(హైదరాబాద్), వివిధ విడతల్లో నగదు తీసుకుని మోసగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు కొనివ్వకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే నిరాకరించడంతో ప్రదీప్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు.


