News June 4, 2024
BIG BREAKING: 33 స్థానాల్లో కూటమి ఆధిక్యం

ఏపీలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కూటమి 33 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇందులో టీడీపీ 28 చోట్ల, జనసేన 5 స్థానాల్లో ఉన్నాయి. టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పూతలపట్టులో మురళీ మోహన్ లీడ్‌లో ఉన్నారు. ఇక పిఠాపురంలో పవన్, తెనాలిలో నాదెండ్ల మనోహర్ లీడ్ కనబరుస్తున్నారు.
Similar News
News January 25, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.
News January 25, 2026
సూర్యుడు ఎలా జన్మించాడో తెలుసా?

బిగ్ బ్యాంగ్ థియరీ విశ్వం ఎలా పుట్టిందో చెబుతుంది. అలాగే మన పురాణాలు ఓంకార విస్ఫోటనం నుంచి కాంతి, సూర్యుడు జన్మించాయని చెబుతున్నాయి. సూర్యగోళానికి అధిపతి మార్తాండుడు. ఈయన కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల కుమారుడు. మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడు జన్మించాడని ప్రతీతి. సూర్య జననం జరగకముందే ఇతర గ్రహాలు పుట్టాయట. కానీ వాటికి గమనం లేదు. సూర్యుడు జన్మించాకే సృష్టికి ఒక క్రమ పద్ధతి, దిశ ఏర్పడ్డాయి.
News January 25, 2026
పిల్లలు పాలు ఎక్కువగా కక్కేస్తున్నారా?

పసిపిల్లలకు పాలు పట్టించినపుడు కొన్నిసార్లు కక్కేస్తూ ఉంటారు. అయితే ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. శిశువుల్లో ఆహారాన్ని జీర్ణం చేసుకొనే అవయవాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందవు. అలాగే వారు పాలు తాగేటపుడు గాలిని కూడా పీల్చుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అయితే పిల్లలు బరువు పెరగకపోయినా, వారి బాడీ వంకరగా ఉన్నట్లు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


