News November 6, 2024

BIG BREAKING: అల్లు అర్జున్‌కు ఊరట

image

AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. నంద్యాలలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలకు వెళ్లగా, అనుమతి లేని పర్యటన, కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పిచ్చింది.

Similar News

News December 10, 2025

మరోసారి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తా: ట్రంప్

image

అధ్యక్షుడిగా తన తొలి టర్మ్‌లో US ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే బలమైనదిగా నిలిపానని ట్రంప్ అన్నారు. ఈసారి మరింత పెద్దగా, గతంలో ఎన్నడూ చూడని దృఢమైన వ్యవస్థను నిర్మిస్తానని చెప్పారు. దీని కోసం చాలా శ్రమించాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడకపోతే దేశ పౌరులుగా ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి రాకముందు కొత్త ఉద్యోగాలన్నీ వలసదారులకు వెళ్లేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.

News December 10, 2025

గొడవలు ఎందుకొస్తాయంటే?

image

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్‌గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

News December 10, 2025

కాశీలో శని దోషాలు పోగొట్టే ఆలయం

image

కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి దేవి ఆలయాలతో పాటు అన్నపూర్ణాదేవి గుడి కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆహారానికి లోటుండదని నమ్మకం. అలాగే సంకట మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే సంకటాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనంతో ఏలినాటి శని దోషాలు పోతాయని అంటున్నారు. భక్తులు మణికర్ణికా, దశాశ్వమేధ ఘాట్‌లు దర్శించి గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.